Suryapet: వనమహోత్సవంలో పాల్గొన్న సూర్యాపేట కలెక్టర్, ఎస్పీ

Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వనమహోత్సవం ఘనంగా జరిగింది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 25 July 2026 4:41 PM IST
Suryapet
X

Suryapet: వనమహోత్సవంలో పాల్గొన్న సూర్యాపేట కలెక్టర్, ఎస్పీ

సూర్యాపేట: పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ఏకాలంలో 1500 మొక్కలు నాటారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ లు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ..

చెట్లు, అడవులు పెంచడం వల్ల పర్యావరణ రక్షణతో పాటు సమృద్ధిగా వర్షాలు కురవడానికి దోహదపడుతుందన్నారు. వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు, నాటిన ప్రతి మొక్కను మహా వృక్షంలా ఎదిగేలా బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు.

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పోలీసులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతోందని, నీటి ఎద్దడిని తట్టుకునే పంటలవైపు రైతులు ఆలోచన చేయాలని సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ క్యాంటీన్, పరేడ్ గ్రౌండ్, జిమ్ వంటి సదుపాయాలతో పాటు ఆహ్లాదకర వాతావరణం కోసమే ఈ మొక్కల పెంపకం చేపట్టినట్లు తెలిపారు.

ఎస్పీ నరసింహ మాట్లాడుతూ..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ పోలీస్ వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

చెట్లు, అడవుల పెంపకం వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మారుస్తుందని, మంచి వర్షపాతానికి ఉపయోగపడుతుందన్నారు. తక్కువ నీటితో పండే పంటలపై రైతులకు పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతతోనూ పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రజల రక్షణ, భద్రత మా ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు:

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మంజు భార్గవి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రవి, నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డీఏఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, ఎం. అశోక్, సాయిరాం, రాజశేఖర్, కె. అశోక్, అన్వర్, అఖిల్, ఎస్ఐలు యాదవేందర్, మహేష్, మౌనికతో పాటు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story