Noothankal: నూతనకల్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 11 మంది అరెస్ట్!

Noothankal: సూర్యాపేట జిల్లా నూతనకల్ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 11 మందిని అరెస్ట్ చేసి నగదు, ఫోన్లు, 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 22 Aug 2026 10:10 PM IST
Noothankal
X

Noothankal: నూతనకల్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 11 మంది అరెస్ట్!

నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం గ్రామ శివారులో అక్రమంగా పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ నాగరాజు వెల్లడించారు.

పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా పేకాట ఆడుతూ 11 మంది పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 5500 రూపాయల నగదు, పేక ముక్కలు, నాలుగు సెల్ ఫోన్లు మరియు 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పట్టుబడిన వారి వివరాలు..

వీరమల్ల భాను తండ్రి నరసయ్య, కల్లెం కృష్ణా రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి, పెద్దింటి విజయ్ భాస్కర్, బూరెడ్డి దామోదర్ రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి, బూరెడ్డి సంజీవ రెడ్డి తండ్రి పుల్లా రెడ్డి, కొల్లు మహేందర్ రెడ్డి తండ్రి దామోదర్ రెడ్డి, ఇమ్మారెడ్డి మహేష్, రెడ్డి జటాంగి గణేష్, బొడ్డు సురేష్, బొడ్డు రాజులు, జటాంగి సౌనయ్య.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story