Suryapet: నాణ్యమైన పత్తితోనే మద్దతు ధర లభిస్తుంది కలెక్టర్ తేజస్ పవార్!
Suryapet: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే పత్తికి మద్దతు ధర లభిస్తుందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
Suryapet: నాణ్యమైన పత్తితోనే మద్దతు ధర లభిస్తుంది కలెక్టర్ తేజస్ పవార్!
సూర్యాపేట: 2026-27 పత్తి మార్కెటింగ్ సీజన్లో రైతులు నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందేలా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.
పత్తి సాగు, కోత, నిల్వ, విక్రయ ప్రక్రియల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే ఆశించిన ధర లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు పత్తిని మార్కెట్కు తీసుకువచ్చే ముందు తేమ శాతం, పొడవు, మైక్రోనైర్ విలువ వంటి ప్రమాణాలపై దృష్టి సారించాలని కోరారు. పత్తిలో తేమ గరిష్ఠంగా 8 శాతం మాత్రమే ఉండేలా బాగా ఆరబెట్టాలని, ఆకులు, చెత్త, ఇతర వ్యర్థాలు కలవకుండా శుభ్రంగా ఉంచాలని సూచించారు.
పత్తి నాణ్యత ఆధారంగానే కొనుగోలు ధర నిర్ణయించబడుతుందని, వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది సూచనలు పాటించాలన్నారు. విక్రయ సమయానికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పహాణీ/పట్టాదార్ పాస్ పుస్తకం వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు విధానాలను వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కొనుగోలులో సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారులను, కేంద్రాల నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, ఆర్డీవోలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, ఆర్టీఓ పురుషోత్తం రెడ్డి, డీఎంఓ దామోదర్, హార్టికల్చర్ అధికారి నాగయ్య, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.




