Suryapet: రైల్వే లైన్ సాధన.. 11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష!

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ మరియు బుల్లెట్ ట్రైన్ సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరాయి.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 24 Aug 2026 1:20 PM IST
Suryapet
X

Suryapet: రైల్వే లైన్ సాధన.. 11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష!

సూర్యాపేట: సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ ను సాధించి తీరుతామని రైల్వే సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. జాతీయ రహదారి 65 కు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ సాధన కోసం బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి.

11వ రోజు దీక్షలో జర్నలిస్ట్ జేఏసీ నాయకులు కూర్చుని తమ మద్దతు ప్రకటించారు. రైల్వే సాధన సమితి చేసే ప్రతి పోరాటానికి జర్నలిస్టుల పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు.

ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, సంకినేని వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ, సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ కోసం బుల్లెట్ సాధన సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు.

దీక్షలో కూర్చున్న జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వజ్జే వీరయ్య, గుండ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మొదట సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ జరిగినప్పటికీ దాన్ని పక్కదారి పట్టించి రాజకీయాలు చేశారని ఆరోపించారు.

రైల్వే లైన్ ఉన్న వైపే మరో రైల్వే లైన్ వేయడంలో అర్థం లేదని, ఇప్పటికైనా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మొదట కేటాయించినట్లుగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ జరిగేలా చూడాలని కోరారు.

ఈ దీక్షలో జర్నలిస్ట్ జేఏసీ నాయకులు వాసా చంద్రశేఖర్, అయితగాని రాంబాబు, గుణగంటి సురేష్, నాయని శ్రీనివాస్ రావు, బుక్క రాంబాబు, మల్లికార్జున్, సుంకరబోయిన వెంకటయ్య, ఫణీంద్ర నారాయణ, ఊట్కూరి రవీందర్, కొడిదల రాజబాబు, కందుకూరి యాదగిరి, దన్యాకుల వెంకటేశ్వర్లు, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వీరికి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, మండాది డేవిడ్ కుమార్, పోలబోయిన కిరణ్, రాపర్తి శ్రీనివాస్, నేరెళ్ల మధు, షర్టు నాగయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story