Suryapet: వైన్ షాప్ లో దొంగతనం కేసులో అలవాటు నేరస్తుడు అరెస్ట్ - 305 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం!

Suryapet: సూర్యాపేట రూరల్ పరిధిలో వైన్ షాప్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 16కు పైగా కేసులు ఉన్న అలవాటుపడిన దొంగ రాచపల్లి మహేష్ అరెస్ట్, రిమాండ్.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 8 Nov 2026 9:41 AM IST
Suryapet
X

Suryapet: వైన్ షాప్ లో దొంగతనం కేసులో అలవాటు నేరస్తుడు అరెస్ట్ - 305 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం!

Suryapet: సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామంలో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి రూరల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆగస్టు 10, 2026 రాత్రి కుసుమవారిగూడెం గ్రామం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్‌లో గుర్తుతెలియని వ్యక్తులు షట్టర్లు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. వైన్ షాప్‌తో పాటు పక్కనే ఉన్న కిరాణా దుకాణం, కూల్ డ్రింక్స్ షాప్‌లలో దొంగతనం చేసి నగదు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. వైన్ షాప్ క్యాషియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 262/2026, U/s 331(4), 305 BNS-2023 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నవంబర్ 7 ఉదయం సూర్యాపేట రూరల్ ఎస్సై ఎం. అనిల్ రెడ్డి మరియు సిబ్బంది జనగాం 'ఎక్స్' రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, నాగంపేట గ్రామానికి చెందిన రాచపల్లి మహేష్ @ రసపల్లి మహేష్ (33) గా గుర్తించారు.

నిందితుడు తన నేరాన్ని అంగీకరించగా, అతని వద్ద నుండి దొంగిలించబడిన వెండి ఆభరణాలు (సుమారు 305 గ్రాముల వెండి గజ్జెలు, వెండి గొలుసులు) మరియు ఒక వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ మరియు వేలిముద్రల ఆధారంగా నిందితుడు గతంలో కూడా పలు నేరాలలో భాగస్వామిగా ఉన్నట్లు తేలింది.

నిందితుడు రాచపల్లి మహేష్ ఒక అలవాటుపడిన నేరస్తుడు. ఇతనిపై కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, రామగుండం తదితర జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 16 కి పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి.

నిందితుడిని అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బంది ఉమా మహేష్, అశోక్, సాయిశంకర్ లను సూర్యాపేట డీఎస్పీ వి. ప్రసన్న కుమార్, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. రాజశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA