Suryapet: కోహెన్స్ సువెన్ ఫార్మా పరిశ్రమను మూసివేయాలి

Suryapet: సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం వెదజల్లుతున్న కోహెన్స్ సువెన్ ఫార్మా పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలికి సర్పంచుల ఫిర్యాదు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Nov 2026 9:32 PM IST
Suryapet
X

Suryapet: కోహెన్స్ సువెన్ ఫార్మా పరిశ్రమను మూసివేయాలి

సూర్యాపేట: కోహెన్స్ సువెన్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమను వలన పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుందని తక్షణమే శాశ్వతంగా మూసివేసి జనావాసాలకు దూరంగా తరలించాలని కోరుతూ కోహెన్స్ పరిశ్రమ పరిసర ప్రాంతాల సర్పంచ్ లు జాటోత్ తండ గ్రామ సర్పంచ్ జాటోతు నగేష్ నాయక్, కాసరబాద సర్పంచ్ కోతి గోపాల్ రెడ్డి,ఇమాంపేట గ్రామ సర్పంచ్ నగిరే నాగేశ్వరి నాగరాజు, కేసారం సర్పంచ్ రేఖ రమణ సతీష్ గౌడ్, రామ్ల తండ సర్పంచ్ హథీరాం, రూప్ల తండ సర్పంచ్ భిక్షo నాయక్, తాళ్లఖమ్మంపహాడ్ సర్పంచ్ మండవ వీరాంజనేయులు,కె,టి అన్నారం సర్పంచ్ శరభా చారీలు, తండావాసులు హైదరాబాదులోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేసి మాట్లాడారు.

ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతో కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమకు విద్యుత్ సరఫరా ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా కానీ ఆ కంపెనీ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను ధిక్కరిస్తూ సిబ్బందితో సోలార్ తో పరిశ్రమను యధావిధిగా నిర్వహిస్తుందని వాపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిశ్రమ వలన పరిసర ప్రాంతాల ప్రజలు విపరీతమైన విష కాలుష్యం , దుర్వాసన, తరచుగా జరిగే ప్రమాదాల వలన అనేకమంది మృతి చెంది అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు.

పరిశ్రమను మూసివేయాలని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజా ప్రతినిధులు, తండావాసులు డిమాండ్ చేస్తున్నప్పటికీ పరిశ్రమ నిర్వాహకులు ఖాతరు చేయడం లేదని వాపోయారు. తక్షణమే కోహెన్స్ సువెన్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిట్టు, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA