Suryapet: సూర్యాపేటను సురక్షిత పట్టణంగా మారుస్తాం.. ఎస్పీ నరసింహ
Suryapet: సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ ఐపీఎస్.
Suryapet: సూర్యాపేటను సురక్షిత పట్టణంగా మారుస్తాం.. ఎస్పీ నరసింహ
సూర్యాపే: జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో సిబ్బంది గౌరవ వందనం పలికారు. ఎస్పీ కవాతును పరిశీలించి సిబ్బంది యూనిఫామ్, కిట్లను పరిశీలించారు. సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి విధుల్లో ఎదురయ్యే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వనమహోత్సవంలో భాగంగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతల ఫైళ్లు, పెండింగ్ కేసుల వివరాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫిర్యాదులు, కేసులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, కోర్టులతో సమన్వయం చేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పట్టణ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని అత్యంత సురక్షిత పట్టణంగా తీర్చిద్దుతామన్నారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వేధింపులకు పాల్పడే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సేవలను సులభతరం చేసేందుకు ఫిర్యాదు అందిన వెంటనే బాధితుల ఇళ్లకు వెళ్లి కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. రౌడీషీటర్లు, భూకబ్జాదారులపై నిరంతర నిఘా ఉంచుతామని, ట్రాఫిక్ సమస్యల నివారణకు ‘ఆపరేషన్ రోప్’ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ తనిఖీలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎస్సైలు ఏడుకొండలు, మహేందర్, శివతేజ, సందీప్, వెంకన్న, రహిముద్దీన్, ఏఎస్సై శంకర్ తదితరులు పాల్గొన్నారు.




