Suryapet: కోదాడ రోడ్డు ప్రమాదంపై స్పందించిన ఎస్పీ నరసింహ!
Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ప్రైవేటు బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
Suryapet: కోదాడ రోడ్డు ప్రమాదంపై స్పందించిన ఎస్పీ నరసింహ!
Suryapet: ప్రైవేటు బస్సు డ్రైవర్ అతివేగమే కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణమని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఒక ఇండస్ట్రియల్ కంపెనీ నిర్మాణం కోసం తీసుకెళ్తున్న భారీ ఐరన్ పిల్లర్స్‌ను బస్సు వేగంగా ఢీకొట్టడంతో.. ఆ ఇనుప రాడ్లు వాహనం లోపలికి దూసుకెళ్లాయని చెప్పారు.
సీట్లలో ఉన్న ప్రయాణికులపై అవి పడటంతో అక్కడికక్కడే ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి అత్యవసర వైద్యం అందిస్తున్నామని ఎస్పీ స్థానిక మీడియాకు తెలిపారు.
Next Story




