Suryapet: సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై శివ తేజపై ఫిర్యాదు లేదు: ఎస్పీ నరసింహ

Suryapet: సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై శివ తేజపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాలేదని జిల్లా ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 May 2026 1:58 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై శివ తేజపై ఫిర్యాదు లేదు: ఎస్పీ నరసింహ

సూర్యాపేట: సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శివ తేజపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని సూర్యాపేట ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ఇటీవల ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో తనను ఒక వ్యక్తి వేధించాడని ఫిర్యాదు చేసింది. అయితే వెంటనే ఆమె కేసును ఉపసంహరించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ఎస్సైకి వాయిస్ మెసేజ్ పంపినప్పుడు, నేరుగా స్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పాలని ఎస్సై సూచించినట్లు బాధిత మహిళ విచారణలో వెల్లడించింది. పోలీసులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా అంతర్గత విచారణ తప్పనిసరిగా నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థపై నిరాధారమైన ఆరోపణలు చేసినా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story