Suryapet: సూర్యాపేట పోలీస్ ఆఫీస్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడిన ఎస్పీ నరసింహ ఐపీఎస్.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 15 Aug 2026 1:49 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట పోలీస్ ఆఫీస్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Suryapet: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి, జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేసి మిఠాయిలు పంచారు.

కార్యక్రమంలో మాట్లాడిన ఎస్పి నరసింహ, ఈనాటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఎందరో మహానుభావుల త్యాగఫలమని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆదర్శాలను, వారు చూపిన శాంతియుత మార్గాన్ని అనుసరించి పౌరులు నడుచుకోవాలని కోరారు.

నేర రహిత, శాంతియుత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల రక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు జరుగుతోందని, నేర నియంత్రణ కోసం రాత్రింబవళ్ళు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.

ప్రజలకు, బాధితులకు వేగవంతంగా పోలీసు సేవలు అందిస్తున్నామని, ఆపద సమయంలో ఎప్పుడైనా డయల్ 112 ద్వారా పోలీసు సహాయం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story