Suryapet: బాధితులకు భరోసా, భద్రతే ప్రథమ కర్తవ్యం.. సూర్యాపేట ఎస్పీ
Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ అధ్యక్షతన నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది.
Suryapet: బాధితులకు భరోసా, భద్రతే ప్రథమ కర్తవ్యం.. సూర్యాపేట ఎస్పీ
సూర్యాపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అధ్యక్షతన పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది. అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, గత నెలలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని ఎస్పీ నరసింహ సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, బాధితులకు తక్షణ భరోసా, రక్షణ కల్పించడమే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
ఎస్పీ ఇచ్చిన ప్రధాన ఆదేశాలు:
- డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్: బాధితుల ఇంటి వద్ద నుండే కేసు నమోదులో అలసత్వం వద్దు
- నేర నివారణ: అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలి
- సాంకేతికత: కేసుల ఛేదనలో శాస్త్రీయ పద్ధతులు, సాక్ష్యాధారాల నమోదు పక్కాగా ఉండాలి
- సీసీ కెమెరాలు: గ్రామాల్లో భద్రతా వలయాలు, సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రజలు, వ్యాపారులు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
- ప్రజా అవగాహన: రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, మహిళల భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి
కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డిసిఆర్బి డీఎస్పీ రవి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్, సైబర్ సెక్యూరిటీ, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు, సిఐలు, ఏసీలు, సిబ్బంది సమావేశానికి హాజరయ్యారు.




