Suryapet: ఒక్కరోజు ఉపాధ్యాయుడిగా మారిన సూర్యాపేట జిల్లా ఎస్పీ!

Suryapet: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పోలీస్ యూనిఫాం పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 20 Jun 2026 2:57 PM IST
Suryapet
X

Suryapet: ఒక్కరోజు ఉపాధ్యాయుడిగా మారిన సూర్యాపేట జిల్లా ఎస్పీ!

సూర్యాపేట: పోలీస్ యూనిఫాం పక్కన పెట్టి ఒక్కరోజు ఉపాధ్యాయుడిగా మారారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. తన పూర్వపు ఉపాధ్యాయ వృత్తిని గుర్తుచేసుకుంటూ విద్యార్థులకు స్వయంగా పాఠాలు చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు.

శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎస్పీ సందర్శించారు. 8వ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి సాంఘికశాస్త్రంలోని "ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం" పాఠాన్ని బోధించారు. ఎస్పీ గారు చెప్పిన పాఠాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా విన్నారు.

ఈ సందర్భంగా తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే కుమారుడు రుత్విక్‌ను చదివిస్తున్న జూనియర్ అసిస్టెంట్ హరితను ఎస్పీ సన్మానించి అభినందించారు.

మాట్లాడిన ఎస్పీ నరసింహ, ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను సృజనాత్మకంగా బోధిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి మంచి భవిష్యత్తునివ్వాలని కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి, చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్సైలు ఏడుకొండలు, సాయిరాం, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story