Suryapet: ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కనబెట్టి ఎస్పీ సీరియస్ వార్నింగ్!
Suryapet: సూర్యాపేట జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Suryapet: ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కనబెట్టి ఎస్పీ సీరియస్ వార్నింగ్!
Suryapet: సూర్యాపేట జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్పష్టం చేశారు. సమాజంలో అభద్రతా భావం కల్పించే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.
17 జూన్ 2026న జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఇరు వర్గాల మధ్య దాడులు, మద్యం మత్తులో యువత రెచ్చిపోయి దాడులకు పాల్పడే ఘటనలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. "హద్దు దాటితే దండనే. నాన్ బెయిలబుల్ వారెంట్లతో నేరుగా జైలుకు పంపిస్తాం" అని ఎస్పీ హెచ్చరించారు.
పాత నేరస్తులు, తీవ్రమైన కేసుల్లో ఉన్న నిందితులపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వారి రౌడీ షీట్లు నమోదు చేసి, వ్యక్తిగత వివరాలు, ఫోన్లను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ప్రతి నెలా పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. సందర్భం, తీవ్రతను బట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కనపెట్టి చట్టానికి పని చెప్తామని స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఎస్పీ నరసింహ ఐపీఎస్ తేల్చి చెప్పారు.
ప్రజలకు విజ్ఞప్తి
కాలనీలు, రోడ్ల వెంట అడ్డాలు వేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిల వివరాలను ప్రజలు పోలీసులకు అందించాలని కోరారు. అలాంటి వారి ఫోటోలు, వీడియోలను 8712686026 నంబర్‌కు పంపితే సమాచారం గోప్యంగా ఉంచుతామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ చర్యలతో జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.




