Suryapet: ఈనెల 15, 16న ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు: కలెక్టర్!

Suryapet: సూర్యాపేట జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 14 Oct 2026 6:25 PM IST
Suryapet
X

Suryapet: ఈనెల 15, 16న ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు: కలెక్టర్!

సూర్యాపేట: భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈనెల 15.10.2026 మరియు 16.10.2026 (గురు, శుక్రవారాలు) తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార క్యాంపులు (Special Camps) నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి (DEO) తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఇటీవల ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, అలాగే 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందబోయే యువత (మొదటిసారి ఓటర్లు) అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

దరఖాస్తు విధానం:

కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6 (Form-6) నింపి అవసరమైన పత్రాలతో పాటు డిక్లరేషన్ ఫారం నింపి (వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలు) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోలింగ్ కేంద్రాల్లో బి.ఎల్.ఓ లు అందుబాటు

ప్రత్యేక క్యాంపు రోజుల్లో ఉదయం నుంచే సంబంధిత బూత్ లెవెల్ అధికారులు (BLO) మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు (BLA) అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్థానికంగా అందుబాటులో ఉంటారు.

అధికారులకు ఆదేశాలు

సూర్యాపేట జిల్లా పరిధిలోని ఎన్నికల నోడల్ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు (EROలు) అందరూ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రత్యేక క్యాంపులు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సూర్యాపేట జిల్లాలోని అర్హులైన యువత మరియు పౌరులందరూ తమ సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును పొంది భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET