Suryapet: రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి శ్రీకృష్ణ ట్రస్ట్ ఎదగాలి
Suryapet: యాదవ సామాజిక వర్గం ఐక్యతతో రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి శ్రీకృష్ణ ట్రస్ట్ ఎదగాలని బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆకాంక్షించారు.
Suryapet: రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి శ్రీకృష్ణ ట్రస్ట్ ఎదగాలి
సూర్యాపేట: శ్రీకృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీసీ ఉద్యమ నాయకులు వట్టే జానయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ తదితర ప్రముఖులకు, శ్రీకృష్ణ ట్రస్టు కమిటీ సభ్యులకు, యాదవ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ ట్రస్టు కేవలం ఒక సంస్థగా కాకుండా యాదవ కుటుంబాల ఐక్యతకు, విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచే వేదికగా ఎదగాలని ఆకాంక్షించారు. మొదట కేవలం 11 మందితో ప్రారంభమైన ఆలోచన నేడు 118 మంది సభ్యులను దాటి, 200 మంది సభ్యులతో మరింత విస్తరించే దిశగా అడుగులు వేయడం సంతోషకరమన్నారు.
ట్రస్టు ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితం కాకుండా అన్ని పార్టీల్లో ఉన్న యాదవ నాయకులు, కుటుంబ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రారంభించామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో శ్రీకృష్ణ ట్రస్టు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో బీసీల జనాభా, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి ఉన్న బలాన్ని గుర్తించి రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేవలం ఓట్లకే పరిమితం కాకుండా రాజకీయ అధికారంలోనూ, కీలక పదవుల్లోనూ బీసీలకు సముచిత స్థానం దక్కాలని అన్నారు.
రాజకీయంగా ఐక్యత సాధిస్తేనే మన జాతి భవిష్యత్తును మార్చుకోగలమని, ఇతర సామాజిక వర్గాల మాదిరిగా మనం కూడా రాజకీయంగా బలపడాలని పిలుపునిచ్చారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ యాదవ నాయకులు తమ విలువను గుర్తించేలా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.
విద్యార్థులకు సహాయం చేయడంతో పాటు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలవడం, రాజకీయంగా అవసరమైన వారికి సహకారం అందించడం వంటి కార్యక్రమాలకు శ్రీకృష్ణ ట్రస్టు కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు.
నల్లగొండ జిల్లాకు యాదవ సామాజిక వర్గం రాజకీయంగా ప్రత్యేక చరిత్ర ఉందని గుర్తుచేస్తూ, ఆ చరిత్రను కొనసాగించాల్సిన బాధ్యత యువతతో పాటు ప్రతి కుటుంబ సభ్యుడిపై ఉందన్నారు.
బీసీల చైతన్యం గ్రామస్థాయి నుంచి గడపగడపకు చేరుతున్న ప్రస్తుత తరుణంలో ఐక్యత, సంఘటిత శక్తి, రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు.




