Thungathurthi: చిల్పకుంట్లలో 30 మందికి డబుల్ బెడ్రూం మంజూరు పత్రాలు!

Thungathurthi: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట గ్రామానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు డబుల్ బెడ్రూం మంజూరు పత్రాలు అందజేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 28 Oct 2026 10:45 PM IST
Thungathurthi
X

Thungathurthi: చిల్పకుంట్లలో 30 మందికి డబుల్ బెడ్రూం మంజూరు పత్రాలు!

తుంగతుర్తి: నూతనకల్ మండలం చిల్పకుంట గ్రామానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సమక్షంలో డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూముల పంపిణీ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నిజమైన పేదలకే ఇళ్లను పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ రైతు కోఆర్డినేటర్ బాణాల సుదర్శన్ రెడ్డి, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల నాగమల్లు, గ్రామ శాఖ అధ్యక్షులు పులుసు సైదులు, బిక్కి శ్రీనాథ్, పంతం వెంకన్న, పులుసు రవి, బత్తుల మల్లయ్య, బత్తుల సురేష్, బత్తుల రవి, బత్తుల వెంకట నరసయ్య, బాణాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA