Suryapet: సూర్యాపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా వరుణ యాగం!
Suryapet: సూర్యాపేట అయ్యప్ప స్వామి ఆలయంలో వర్షాల కోసం వరుణ యాగం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.
Suryapet: సూర్యాపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా వరుణ యాగం!
Suryapet: సూర్యాపేట పట్టణంలోని శబరి నగర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించారు.
ఈ యాగంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు, రైతులు సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజలందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, చివ్వేంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ నాయుడు, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఉప్పుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు నాగు నాయక్, పడిదల రవి, చెంచల నిఖిల్, గుంటూరు చిట్టి బాబు, గుణగంటి సైదులు గౌడ్, గుండా వెంకన్న(సుమన్), రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




