Nalgonda: నల్లగొండలో వైభవంగా సయ్యద్ షా లతీపుల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు!
Nalgonda: నల్లగొండ పట్టణంలో సయ్యద్ షా లతీపుల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Nalgonda: నల్లగొండలో వైభవంగా సయ్యద్ షా లతీపుల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో సయ్యద్ షా లతీపుల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ డివిజన్లలో ముస్లిం యువత ఫాంకాలు, గంధం ఊరేగింపు నిర్వహించింది. ముస్లిం యూత్ ఆహ్వానం మేరకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ప్రతి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డికి ముస్లిం యువత వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికింది. అర్ధరాత్రి దాటినా యువత ఉత్సాహం నడుమ ఆయన పట్టణమంతా పర్యటించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండలో హిందూ, ముస్లింలు కలసికట్టుగా ఉర్సు ఉత్సవాలు జరుపుకోవడం ఇక్కడి ఐక్యతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.




