Nakrekal: ఘనంగా ఉపాధ్యాయిని ముస్కు కవితా శేఖర్ రెడ్డి పదవీ విరమణ సభ!

Nakrekal: నకిరేకల్‌లో 42 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన ముస్కు కవితా శేఖర్ రెడ్డి అభినందన సభను PRTU ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 1 Nov 2026 12:38 PM IST
Nakrekal
X

Nakrekal: ఘనంగా ఉపాధ్యాయిని ముస్కు కవితా శేఖర్ రెడ్డి పదవీ విరమణ సభ!

Nakrekal: నకిరేకల్ 42 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన ముస్కు కవిత శేఖర్ రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభను PRTU ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా గాయిని ఉద్దీపణ వైస్ చైర్మన్ వేముల పుష్పక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయిని దంపతులను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి అభినందించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. 42 సంవత్సరాల పాటు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయురాలిగా కవితా శేఖర్ రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారి జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో PRTU నాయకులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL