Miryalaguda: ఉమ్మడి నల్గొండ కబడ్డీ లీగ్ విజేతగా 'టీమ్ సీబీకే!

Miryalaguda: మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంప్ గ్రౌండ్స్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా కబడ్డీ లీగ్ ముగింపు. విజేతగా నిలిచిన టీమ్ సీబీకే. బహుమతులు అందజేసినTGSA చైర్మన్ శివసేన, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.

Saleem, Nalgonda
Published on: 16 Oct 2026 6:25 AM IST
Miryalaguda
X

Miryalaguda: ఉమ్మడి నల్గొండ కబడ్డీ లీగ్ విజేతగా 'టీమ్ సీబీకే!

Miryalaguda: మిర్యాలగూడలోని ఎన్‌ఎస్పీ క్యాంప్ గ్రౌండ్స్‌ వేదికగా నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా కబడ్డీ లీగ్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా ముగిసింది. ఆది నుంచి ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో 'టీమ్ సీబీకే' (TEAM CBK) ప్రతిభ చూపి విజేతగా నిలిచింది.

​సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR), మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలలో పాల్గొన్న ఆరు జట్లకు వారు సాధించిన స్థానాల ఆధారంగా నగదు పురస్కారాలను అందజేసి అభినందించారు.

​కబడ్డీ గ్రాండ్ ఫినాలేను వీక్షించేందుకు ఎన్‌ఎస్పీ గ్రౌండ్స్‌కు క్రీడాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆటగాళ్ల ఊపు, ప్రేక్షకుల ఈలలు, కేరింతలతో మిర్యాలగూడ క్రీడాంగణం హోరెత్తింది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda