Yadagirigutta: ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవం!
Yadagirigutta: యాదగిరిగుట్టలో సెప్టెంబర్ 27న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవం. భారీగా తరలిరావాలని రాష్ట్ర నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి చైర్మన్ పిలుపు.
Yadagirigutta: ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవం!
Yadagirigutta: తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం, సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం, తెలంగాణ పునర్నిర్మాణం మరియు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు స్టేట్ చైర్మన్ చీమ శ్రీనివాస్ మరియు ఫోరం రాష్ట్ర నాయకులు తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రధాన అజెండాగా మార్చడంలో ఫోరం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఉద్యమకారుల అంశాలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చే ప్రక్రియలో కూడా ఫోరం ముఖ్య భూమిక పోషించిందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు కోసం ఫోరం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
చలో యాదగిరిగుట్ట – ఉద్యమకారుల ఐక్యత చాటుదాం!
స్థలం: లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాల్
(జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణం)
తేదీ: సెప్టెంబర్ 27, ఆదివారం
సమయం: ఉదయం 11:00 గంటలకు
ప్రత్యక్ష హాజరు పిలుపు
తెలంగాణ ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, ఉద్యమాభిమానులు పెద్ద సంఖ్యలో యాదగిరిగుట్టకు తరలివచ్చి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యమకారుల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగుతూ, ఫోరం లక్ష్యాలను మరింత బలోపేతం చేయాలని కోరారు.
ఆత్మగౌరవం – సంక్షేమం
సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ – తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణ ఉద్యమకారులారా… ఉద్యమాభిమానులారా. సెప్టెంబర్ 27న యాదగిరిగుట్టకు తప్పక తరలిరండి. ఫోరం 9వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేద్దాం. యాలాల మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం.




