Nalgonda: నల్గొండ సీఎం సభలో ఉద్రిక్తత.. సెక్యూరిటీపై కార్పొరేటర్ ఫైర్

Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో సీఎం బహిరంగ సభలో ఉద్రిక్తత. భద్రతా సిబ్బంది ప్రవర్తనపై స్థానిక కార్పొరేటర్ వాగ్దేవి, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Jun 2026 9:27 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ సీఎం సభలో ఉద్రిక్తత.. సెక్యూరిటీపై కార్పొరేటర్ ఫైర్

నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది ప్రవర్తనపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

​సభ ప్రాంగణంలో సీఎం భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ) వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. స్థానిక కార్పొరేటర్ వాగ్దేవి భర్త బుర్రి శ్రీనివాసరెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తోసివేయడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

తమను లోపలికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు, ప్రజాప్రతినిధుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది అంటూ కార్పొరేటర్ వాగ్దేవి భద్రతా సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story