Nalgonda: 636 మంది ఎఫ్‌టీఎస్ ఉద్యోగుల సేవలను కొనసాగించాలి పాషా డిమాండ్

Nalgonda: భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ పిలుపులో భాగంగా తమ ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాల సాధనకై నల్లగొండ కలెక్టరేట్‌లో ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు.

Saleem, Nalgonda
Published on: 3 Aug 2026 7:36 PM IST
Nalgonda
X

Nalgonda: 636 మంది ఎఫ్‌టీఎస్ ఉద్యోగుల సేవలను కొనసాగించాలి పాషా డిమాండ్

నల్గొండ:​ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ (TGBFTSA) పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు కలెక్టరేట్లలో వినతిపత్రాలు సమర్పించారు. గడచిన ఎనిమిదేళ్లుగా రెవెన్యూ శాఖలో కీలక సేవలు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న 15 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను 636 మంది ఎఫ్‌టీఎస్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ, ఐఎఫ్ఎంఐఎస్ (IFMIS) పోర్టల్ ద్వారా ప్రతి నెలా క్రమంతప్పకుండా వేతనాలు చెల్లించేలా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా నుంచి కోఆర్డినేటర్ జానీ పాషా, నాగరాజు, నదీమ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story