Suryapet: సూర్యాపేటలో పెన్షన్ విద్రోహ దినం: సీపీఎస్ రద్దుకు TGEJAC డిమాండ్!
Suryapet: TGEJAC ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు. సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ (OPS) అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Suryapet: సూర్యాపేటలో పెన్షన్ విద్రోహ దినం: సీపీఎస్ రద్దుకు TGEJAC డిమాండ్!
సూర్యాపేట: TGEJAC రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరు శ్రీనివాసరావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో మంగళవారం పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పింఛన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన పెన్షన్ విధానం (CPS)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా TGEJAC జిల్లా బాధ్యులు దున్న శ్యామ్, సెక్రటరీ జనరల్ ఎన్. భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జీవితాంతం ప్రభుత్వ సేవలందించిన ఉద్యోగుల భవిష్యత్తును మార్కెట్ ఆధారిత పెన్షన్ విధానానికి వదిలేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు నిర్ధిష్టమైన, భద్రమైన పెన్షన్ అందించే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రతపై అనిశ్చితి నెలకొందని, అందువల్ల CPSను పూర్తిగా రద్దు చేసి 01-09-2004 తర్వాత నియమితులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన పెన్షన్ హక్కు సాధించే వరకు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో TGEJAC నాయకులు మట్టపల్లి రాధాకృష్ణ, ఎస్. రవికుమార్, నాయిని ఆకాష్ వర్మ, పాండు నాయక్, కొదిరెక్క నాగేందర్, పి. కరుణాకర్ రెడ్డి, మన్నే యాదగిరి, మాడిపడగ సైదులు, డా. బట్టు గోపి, దర్శనం మల్లేష్, వేంకటరామ రెడ్డి, లక్ష్మయ్య, శ్యామ్ ప్రసాద్, అల్లి సతీష్, భూపతి వెంకటయ్య, నాందీపాటి రవి, కోడి మురళి, బాడే లింగయ్య, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అధ్యక్షులు, కార్యదర్శులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




