Nalgonda: ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ ప్రతిభకు దక్కిన పురస్కారాలు!
Nalgonda: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ కర్ణాటక మీడియా సంస్థల పోటీల్లో ది హ్యాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ ఉత్తమ ఫోటో అవార్డులు గెలుచుకున్నారు.
Nalgonda: ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ ప్రతిభకు దక్కిన పురస్కారాలు!
Nalgonda: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన పోటీల్లో ‘ది హ్యాన్స్ ఇండియా’ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యారు. ‘ప్రాథమిక విద్య’ అంశంపై ఆయన తీసిన చిత్రానికి ప్రత్యేక పురస్కారం లభించింది.
ఈ నెల 23న హైదరాబాద్‌లో ఈ అవార్డును అందజేయనున్నారు. అలాగే, కర్ణాటక మీడియా సంస్థ జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీల్లోనూ ఆయన చిత్రం 'ఉత్తమ వార్తా చిత్రం'గా నిలిచింది. పురస్కారాలు పొందిన ఆయనను పలువురు అభినందించారు.
Next Story




