Suryapet: రిషిత వైన్స్‌లో చోరీ రూ. 58 వేల విలువైన మద్యం, నగదు అపహరణ!

Suryapet: సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని రిషిత వైన్ షాప్‌లో రూ. 58 వేల విలువైన మద్యం, నగదు చోరీ. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు.

Sriveni Erugu
Published on: 22 Aug 2026 1:43 PM IST
Suryapet
X

Suryapet: రిషిత వైన్స్‌లో చోరీ రూ. 58 వేల విలువైన మద్యం, నగదు అపహరణ!

Suryapet: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలోని 'రిషిత వైన్స్-1' దుకాణంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. స్థానికులు మరియు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఉదయం పత్రికలు పంపిణీ చేయడానికి వచ్చిన పేపర్ బాయ్ వైన్ షాప్ తలుపులు తెరచి ఉండటాన్ని గమనించి, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

షాప్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, రాత్రి ఒంటిగంట (1:00 AM) ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. దుండగులు షాప్‌లోకి చొరబడి సుమారు రూ. 23,000 విలువైన మద్యం సీసాలతో పాటు, గల్లా పెట్టెలో ఉన్న రూ. 35,000 నగదును ఎత్తుకెళ్లారని వైన్ షాప్ యజమాని మట్టిపల్లి సుధాకర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu