Yadadri: ప్రైవేటీకరణ వద్దు.. ప్రభుత్వ రంగమే ముద్దు:

Yadadri: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లోని సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 July 2026 12:21 PM IST
Yadadri
X

Yadadri: ప్రైవేటీకరణ వద్దు.. ప్రభుత్వ రంగమే ముద్దు:

యాదాద్రి: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లోని CHP, AHP విభాగాలను 255 కోట్ల వ్యయంతో మూడు సంవత్సరాల పాటు ప్రైవేటీకరించేందుకు చేపట్టిన టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు మరింత ఉదృతం చేస్తున్నట్లు కేటిపిపి ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.

ఈ మేరకు ఘనపురం మండలం చెల్పూర్ కేటిపిపి ఎదుట నల్ల బ్యాడ్జీ లు ధరించి ప్ల కార్డులతో నిరసన తెలిపారు TGPEA, TSEAEA, TEEU-1104, TSSEU-327, TSPEU-1535, కెమిస్ట్ అసోసియేషన్, డిప్లొమా అసోసియేషన్, SC&ST, OC, BMSతో పాటు TGPEJACలోని అన్ని అనుబంధ సంఘాలు, అసోసియేషన్ల నాయకులు ఈ పోరాటం లో కలిసి రావాలని పిలుపునిచ్చారు ytps ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 7 న ytps ముట్టడి చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story