Nalgonda: నేడు నల్లగొండలో ముగ్గురు మంత్రుల పర్యటన!
Nalgonda: మిర్యాలగూడలో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి ఇందిరమ్మ ఇళ్లు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Nalgonda: నేడు నల్లగొండలో ముగ్గురు మంత్రుల పర్యటన!
Nalgonda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో నేడు రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు.ముందుగా దామరచర్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఇందిరమ్మ ఇండ్ల' నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి శంకుస్థాపన నిర్వహిస్తారు.
అనంతరం మిర్యాలగూడలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అడవిదేవులపల్లి తహసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే మిర్యాలగూడ బైపాస్ చింతపల్లి వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న 'శాండ్ బజార్' నిర్మాణానికి శ్రీకారం చుడతారు.
తుంగపహాడ్ వద్ద ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయనున్నారు. కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.




