Suryapet: సూర్యాపేటలో ఉధృతమవుతున్న బుల్లెట్ ట్రైన్ పోరాట కమిటీ దీక్షలు

Suryapet: సూర్యాపేట మీదుగా ఎన్ హెచ్ 65 గుండా బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్చాలని కోరుతూ గీత కార్మికులు రిలే దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 19 Sept 2026 7:49 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఉధృతమవుతున్న బుల్లెట్ ట్రైన్ పోరాట కమిటీ దీక్షలు

Suryapet: సూర్యాపేట మీదుగా ముందుగా ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ ను జాతీయ రహదారి 65 మీదుగా అలైన్ మెంట్ చేసే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని కల్లుగీత కార్మికులు పిలుపునిచ్చారు.

బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో 36వ రోజు శుక్రవారం చేపట్టిన రిలే దీక్షలో ఆత్మకూరు (ఎస్) మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన గీత కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జర్నలిస్టులు వారిని పూలదండలతో స్వాగతించి దీక్షను ప్రారంభించారు.

అనంతరం గీత కార్మికులు మాట్లాడుతూ.. గత 60 రోజులుగా ఉద్యమం కొనసాగుతున్నా, 36 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. బుల్లెట్ ట్రైన్ అలైన్ మెంట్ మార్చడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

సూర్యాపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బుల్లెట్ ట్రైన్ సాధించుకునే వరకు కొనసాగుతున్న ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని, బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు ఉద్యమంలో భాగస్వాములవుతామని స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ ఉద్యమం మారుమూల ప్రాంతాల్లోని సామాన్య ప్రజల్లోకి వెళ్లిందని, ఇక బుల్లెట్ ట్రైన్ ఇవ్వకపోతే సూర్యాపేట జిల్లా ప్రజలు వదిలే పరిస్థితి లేదని హెచ్చరించారు.

వృత్తిపరమైన ఆనవాయితీగా మోకు, ముస్తాదులతో గీత కార్మికులు దీక్షలో కూర్చోవడం అందరినీ ఆకర్షించింది. దీక్షలో మడ్డి వెంకన్న, గుండు లింగయ్య, భూపతి వెంకన్న, గుండు నారాయణ, పల్స వెంకన్న, అంజయ్య, గిలకత్తుల అంజయ్య, మట్టి చిన్న వెంకన్న, మడ్డి వెంకటనారాయణ, గుండు చిన్న లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, నిమ్మల శ్రీనివాస్, మల్లు నాగార్జున రెడ్డి, జర్నలిస్టులు భూపతి రాములు, డేవిడ్ కుమార్, వెలుగు వనిత, వేల్పుల వెంకన్న, చలమల నరసింహ, బొమ్మగాని శ్రీనివాస్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA