Suryapet: టీపీటీఎఫ్ సూర్యాపేట అధ్యక్షుడిగా బండారు శ్రీనివాస్ ఎన్నిక

Suryapet: సూర్యాపేటలో పాఠశాలల కుదింపును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం (TPTF) నిరసన.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 7 Jun 2026 8:14 PM IST
Suryapet
X

Suryapet: టీపీటీఎఫ్ సూర్యాపేట అధ్యక్షుడిగా బండారు శ్రీనివాస్ ఎన్నిక

సూర్యాపేట: పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం - టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. స్నేహ నగర్‌లోని టీపీటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాపర్తి రామనరసయ్య అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో రాష్ట్రంలోని 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ముఖ్యమంత్రి ఆలోచన సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలను మూసివేయకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచే చర్యలు తీసుకుని వాటిని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విద్యా సంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని తీర్మానించారు.

అనంతరం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో బండారు శ్రీనివాస్‌ను టీపీటీఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, సంఘ నిర్మాణానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో టీపీటీఎఫ్ సంఘ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని, ఉపాధ్యాయుల సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్. భిక్షం, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న, పూర్వ అధ్యక్షులు పుప్పాల రవికుమార్, బడుగుల సైదులు, ఎ. హనుమంతరావు, చిరుగాని యాకయ్య, ఎల్పెద్ది సుధాకర్ రెడ్డి, నల్లచంద్రారెడ్డి, జిల్లా జానయ్య, పోతురాజు నరసయ్య, పోలిశెట్టి శ్రీనివాస్, దామెర్ల లాలయ్య, పూసపల్లి మల్లయ్య, తన్నీరు రమేష్ తదితర జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story