Suryapet: మద్దిరాల ఎక్స్‌రోడ్‌లో తోపుడు బండ్ల ఆక్రమణలు.. తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు!

Suryapet: మద్దిరాల ఎక్స్‌రోడ్‌ వద్ద రోడ్డుపైనే తోపుడు బండ్లు నిలపడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 13 Oct 2026 11:44 AM IST
Suryapet
X

Suryapet: మద్దిరాల ఎక్స్‌రోడ్‌లో తోపుడు బండ్ల ఆక్రమణలు.. తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు!

Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్‌ వద్ద రోడ్డు పక్కన కాకుండా రోడ్డుపైనే పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీగా ఉండే ప్రధాన కూడలిలో వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపై తోపుడు బండ్లు నిలపడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగినట్లు పేర్కొంటూ, అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రజలు, ప్రయాణికులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లను తొలగించి, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎస్సై, సంబంధిత శాఖల అధికారులు వెంటనే చొరవ తీసుకొని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy