Nalgonda: దేవుల తండా వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం

Nalgonda: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం దేవుల తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

Sai Potluri
Published on: 30 April 2026 1:42 PM IST
Nalgonda
X

Nalgonda

నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.చింతపల్లి మండలం దేవుల తండా వద్ద అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వింజమూర్ సమీపంలోని దేవుల తండా వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న వారు తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాద విషయం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమో

Sai Potluri

Sai Potluri

Next Story