Devarakonda: దేవరకొండ ఖిల్లా బజార్‌లో చెట్ల నరికివేత.. అధికారుల మౌనంపై నిరసన!

Devarakonda: నల్లగొండ జిల్లా దేవరకొండ ఖిల్లా బజారులోని ప్రభుత్వ గుట్టపై అనుమతులు లేకుండా వృక్షాలను నరికివేస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

Saleem, Nalgonda
Published on: 26 Oct 2026 10:53 AM IST
Devarakonda
X

Devarakonda: దేవరకొండ ఖిల్లా బజార్‌లో చెట్ల నరికివేత.. అధికారుల మౌనంపై నిరసన!

Devarakonda: దేవరకొండ పట్టణంలోని ఖిల్లా బజారులో ప్రకృతి సంపద అన్యాక్రాంతమవుతోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా ప్రభుత్వ గుట్టపై ఉన్న పచ్చని వనాన్ని జేసీబీలతో ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నారు.వార్డుల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారులు, భారీ చెట్ల నరికివేత విషయంలో మాత్రం మౌనం వహించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీడనిచ్చే మహా వృక్షాలు మాయం కావడంతో ఎండ తీవ్రతకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి.ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులే నిద్రావస్థలో ఉండటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తున్న ముఠాను గుర్తించి, వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda