Suryapet: ప్రైవేటు స్కూల్స్ లో అధిక ఫీజు లను నియంత్రణ చేయాలి

Suryapet: విద్యా హక్కు చట్టం-2009ని కచ్చితంగా అమలు చేయాలని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 Jun 2026 3:16 PM IST
Suryapet
X

Suryapet: ప్రైవేటు స్కూల్స్ లో అధిక ఫీజు లను నియంత్రణ చేయాలి

సూర్యాపేట: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులపై నియంత్రం లేదని, ఇష్ట రాజ్యాంగ ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజులు కట్టలేక చాలామంది మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించలేని పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ అన్నారు.

గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూర్యాపేటలో విద్యావ్యవస్థ పూర్తిగా వ్యాపారంగా మారిందని, చాలా పాఠశాలలో అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తున్నారని అన్నారు. కొన్ని పాఠశాలలో మధ్యతరగతి వారు తమ పిల్లలను చదివించలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.

జిల్లా లోని పాఠశాలలో విద్యాహక్కు చట్టం 2009 ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని జిల్లాలో కచ్చితంగా అమలు చేయాలని అందుకోసం తాము పోరాటం చేస్తామని అన్నారు. పేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కును జిల్లా యంత్రాంగం అమలు చేయడం లేదని ఆయన అన్నారు.

ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులతో పాటు పుస్తకాలు ఇంకా యూనిఫాంలు స్టేషనరీ బలవంతంగా అంట కడుతున్నారని, వీటి కోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని వీటి పై జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన అన్నారు.

ప్రైవేటు స్కూల్స్ లో పేరెంట్స్ కమిటీని పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఫీజులపై కచ్చితంగా నియంత్రణ చేయాలని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం ఆధర్యంలో అన్ని పాఠశాలలో తాము ఆందోళన చేస్తామని చెప్పారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన చేయాలని, మరుగుదొడ్లు సౌకర్యం లేక విద్యార్దినులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేసి పరిశుభ్రంగా ఉంచడానికి తగిన సిబ్బంది నియమించాలని ఆయన అన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story