Nalgonda: సీఎం రేవంత్ పర్యటన వేళ ఉద్రిక్తత: నిరసనకు పిలుపు!
Nalgonda: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని, ఎన్‌జీ కళాశాల వద్ద సీఎం కాన్వాయ్‌ను నిలిపివేసి నిరసన తెలుపుతామని తెలంగాణ రక్షణ సేన
Nalgonda: సీఎం రేవంత్ పర్యటన వేళ ఉద్రిక్తత: నిరసనకు పిలుపు!
నల్గొండ: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ హెచ్చరించింది.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి జిల్లాలో ఎలా పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మేడి నరేష్ ప్రశ్నించారు.
నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల ప్రధాన ద్వారం వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ తెలంగాణ మాధవక్క, ఆలేరు ఇంచార్జ్ కందాడి మణిపాల్‌లతో పాటు దాదాపు 50 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
Next Story




