Miryalaguda: చంద్రబాబు సంచలన నిర్ణయం.. నరేంద్ర మోదీ పిలుపుతోనే మహానాడు రద్దు!

Miryalaguda: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు మద్దతుగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో మినీ మహానాడులు రద్దయ్యాయి.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 21 May 2026 4:15 PM IST
Miryalaguda
X

Miryalaguda: చంద్రబాబు సంచలన నిర్ణయం.. నరేంద్ర మోదీ పిలుపుతోనే మహానాడు రద్దు!

నల్గొండ జిల్లా: మిర్యాలగూడ మహానాడు కాకుండా ఆడంబరాలు లేకుండా ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించుకుందాం టీటీడీపీ నాయకులు పోగుల సైదులు గౌడ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సంభవించిన యుద్ధ పరిణామాల వల్ల భారతదేశ ఆర్థిక సంక్షోభం సంభవించకుండా ప్రధాన మంత్రి గౌ. శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు. ..పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మినీ మహానాడులు రద్దు చేయడం జరిగింది కానీ అధిక ఖర్చు, ఆడంబరాలు లేకుండా ఎక్కడి వారు అక్కడే స్థానికంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుందామని తెలుగుదేశం పార్టీ నాయకులు పోగుల సైదులు గౌడ్ పిలుపునిచ్చారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ,తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఎటువంటి ఆడంబరాలకు లేకుండా తెలుగు ప్రజల శ్రేయస్సు పరమావధిగా భావించి దేశంలో ఆర్థిక సంక్షోభం తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ స్థానికంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story