Suryapet: జర్నలిస్టుల సమస్యలపై సూర్యాపేటలో నేడు ధర్నా!
Suryapet: జర్నలిస్టుల సమస్యలపై సూర్యాపేటలో శుక్రవారం భారీ ధర్నా టీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర నేత చలసాని పిలుపు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, రక్షణ చట్టం తేవాలని డిమాండ్.
Suryapet: జర్నలిస్టుల సమస్యలపై సూర్యాపేటలో నేడు ధర్నా!
సూర్యాపేట: దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) - ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం చేపట్టే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని TUWJ, IJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలో గురువారం TUWJ-IJU ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఎంజీ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అనంతరం కొత్త బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అక్షరమే ఆయుధంగా జీవనం సాగిస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, బస్సు పాస్ లో రాయితీ కల్పించడం లేదని, గతంలో వన్ బై థర్డ్ ఉండగా ఇప్పుడు 50% చార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోర్త్ ఎస్టేట్ గా పరిగణించే జర్నలిజం రంగానికి రక్షణ లేకుండా పోయిందని, జర్నలిస్టులపై దాడులు నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో TUWJ-IJU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి బత్తుల మల్లికార్జున్, సీనియర్ జర్నలిస్టులు సుంకరబోయిన వెంకటయ్య, తల్లాడ చందన్, పులుసు నాగరాజు గౌడ్, కందుకూరి యాదగిరి, శిగ సురేష్, షేక్ రషీద్, గుడిపూడి రామకృష్ణ, కందుల నాగరాజు, ఉయ్యాల నర్సయ్య, మాదగోని వేణు, పల్లె మణిబాబు, కొండ్లె కృష్ణయ్య, తండు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




