Munagala: మునగాలలో వాటర్ ట్యాంక్ ఎక్కి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం!

Munagala: మునగాల మండలం ముకుందాపురంలో భూవివాదం. తమ భూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఆపాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 7 Sept 2026 8:46 PM IST
Munagala
X

Munagala: మునగాలలో వాటర్ ట్యాంక్ ఎక్కి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం!

మునగాల: మండలంలోని ముకుందాపురం గ్రామంలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆరోపిస్తూ ఇద్దరు అన్నదమ్ములు వాటర్ ట్యాంక్ ఎక్కి మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

​గ్రామానికి చెందిన పందిరి సత్యనారాయణరెడ్డి, పుల్లారెడ్డి తమ వారసత్వ భూమిలో సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఆ భూమిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టవద్దని వారు ఎంతగానో కోరినా అధికారులెవరూ పట్టించుకోలేదు. అంతేకాకుండా, అధికారులు జేసీబీ సహాయంతో తమ గడ్డివామును తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

​అధికారుల ఏకపక్ష తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన అన్నదమ్ములు ఇద్దరూ పక్కనే ఉన్న నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి దిగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పడంతో చివరకు ఇద్దరూ కిందికి దిగివచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ​తమ భూమి విషయంలో అధికారులు తక్షణమే న్యాయం చేయాలని.. తమ భూమిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు చేపట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD