Nalgonda: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ జర్నలిస్టులు అరెస్ట్!
Nalgonda: తప్పుడు వార్తలు రాస్తామంటూ అధికారులు, సర్పంచ్‌లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ జర్నలిస్టులను అరెస్ట్ చేసిన నల్లగొండ పోలీసులు.
Nalgonda: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ జర్నలిస్టులు అరెస్ట్!
Nalgonda: తప్పుడు వార్తలు రాస్తామంటూ అధికారులు, ప్రజాప్రతినిధులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం చింతమల్ల శ్రీనివాస్, ఇరిగి శ్రీను అనే వ్యక్తులు తాము విలేకరులమని చెబుతూ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురిచేసేవారు.
డబ్బులు ఇవ్వకపోతే కథనాలు రాస్తామంటూ వేధించేవారు. ఈ క్రమంలో ఓ సర్పంచ్ కుటుంబ సభ్యుడిని రూ.30 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.




