Nalgonda: నకిరేకల్‌లో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Nalgonda: నకిరేకల్ సర్కారు ఆస్పత్రిలో ఉద్దీపన ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. దీనిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం, కైలాష్ ప్రారంభించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 11 Aug 2026 12:59 PM IST
Nalgonda
X

Nalgonda: నకిరేకల్‌లో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Nalgonda: నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నలగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత హాజరై ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత సంవత్సరం వెయ్యి మందికి ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయించామని ఆయన తెలిపారు.

ఈ సంవత్సరం కూడా నియోజకవర్గ ఆరు మండలాలలో ఉచిత శిబిరాలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కళ్ళ అద్దాలు అందిస్తామని తెలిపారు.

హైదరాబాద్ పుష్పగిరి హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. శిబిరానికి హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో చామల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి ఫ్యాక్స్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ రజిత శ్రీనివాస్ లింగాల వెంకన్న పన్నాల రాఘవరెడ్డి గాజుల సుకన్య గాధగోని కొండయ్య మురారి శెట్టి కృష్ణమూర్తి ఎడ్ల ప్రవీణ్ నకిరేకల్ ప్రభుత్వ హాస్పటల్ సూపర్డెంట్ శోభారాణి ఉద్దీపన ఫౌండేషన్ కోఆర్డినేటర్ చెరుకు సతీష్ కాంపాటి శ్యామ్ మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story