Suryapet: కేజీబీవీ హాస్టల్‌లోకి అర్ధరాత్రి యువకుడు ప్రవేశం!
Suryapet: సూర్యాపేట జిల్లా మోతె కేజీబీవీ హాస్టల్‌లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడి సంచరించడం కలకలం రేపింది.
Suryapet: కేజీబీవీ హాస్టల్‌లోకి అర్ధరాత్రి యువకుడు ప్రవేశం!
Suryapet: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్‌లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.సిబ్బంది కంటపడకుండా ఏకంగా రెండు గంటల పాటు హాస్టల్ ఆవరణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుని చూసి విద్యార్థులు,సిబ్బంది అప్రమత్తమై గట్టిగా అరవడంతో గోడ దూకి పరారయ్యాడు.రక్షణగా ఉండాల్సిన చోటే భద్రత లోపించడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా పిల్లల ప్రాణాలకు రక్షణ లేదా అంటూ అధికారులను నిలదీస్తున్నారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ క్రాంతికుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ లచ్చిరెడ్డి.. దర్యాప్తును ముమ్మరం చేశారు.హాస్టళ్లలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.
Next Story




