Suryapet: అమెరికాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Suryapet: అమెరికాలోని ఫ్లోరిడాలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎన్ఆర్ఐలు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 24 July 2026 8:21 PM IST
Suryapet
X

Suryapet: అమెరికాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు జన్మదిన వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా తెలంగాణలోని తుంగతుర్తి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిక్కీ బుచ్చయ్య గౌడ్, ఆయన సతీమణి బిక్కీ మంగమ్మ తమ మనవరాలు సాయి శ్రీ కృతితో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బుచ్చయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతినే లక్ష్యంగా నిరంతరం సేవలందిస్తున్న కేటీఆర్ మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ప్రజా సంక్షేమం పట్ల కేటీఆర్ చూపుతున్న నిబద్ధత మరింత బలపడాలని, భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story