Kodad: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన వంగవీటి రామారావు!
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు భూమిపూజ నిర్వహించారు.
Kodad: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన వంగవీటి రామారావు!
Kodad: ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో, కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్, 11వ వార్డు కౌన్సిలర్ దేవరపల్లి మల్లీశ్వరి నాగిరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఇటీవల మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు దేవపంగు రమాదేవి,అశోక్ దంపతుల ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, వార్డు కౌన్సిలర్ దేవరపల్లి మల్లీశ్వరి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ వంగవీటి రామారావు, దేవరపల్లి మల్లీశ్వరి నాగిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మల్లెల అనంతలక్ష్మి, కాంగ్రెస్ యువజన నాయకులు తమలపాకుల లక్ష్మీనారాయణ, దాసరి నాగరాజు, చింత సుధాకర్, చింత వినోద్, గౌరి, దేవపంగు బాబూరావు, దేవపంగు వెంకటి, దేవపంగు కళ్యాణ్, మధు, సూరి, చార్లీ తదితరులు పాల్గొన్నారు.




