Narketpally: నార్కెట్‌పల్లిలో ఉచిత రక్త పరీక్ష కేంద్రం ప్రారంభం!
Narketpally: నార్కెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సంఘాల కోసం ఉచిత రక్త పరీక్ష కేంద్రాన్ని విప్ వేముల వీరేశం ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Narketpally: నార్కెట్‌పల్లిలో ఉచిత రక్త పరీక్ష కేంద్రం ప్రారంభం!
నార్కెట్‌పల్లి: నార్కెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్త పరీక్ష కేంద్రం ప్రారంభించిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నార్కెట్‌పల్లి, ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సంఘ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.
ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు: ఎమ్మెల్యే
ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఈ ఉచిత రక్త పరీక్ష ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మహిళా సంఘ సభ్యులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజా సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజలకు ఎంత ఎక్కువ సేవ చేయగలిగితే అంత చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి విద్య మరియు వైద్య రంగాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఎలాంటి ఖర్చులు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నందున ప్రజలు ముందుకు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.




