Nakrekal: గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం ఎమ్మెల్యే వేముల వీరేశం!

Nakrekal: తాటికల్‌లో నూతన మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 29 Jun 2026 10:54 AM IST
Nakrekal
X

Nakrekal: గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం ఎమ్మెల్యే వేముల వీరేశం!

నకిరేకల్: మండలం తాటికల్ గ్రామంలో మహిళా సమాఖ్య సంఘం కోసం నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత ముందుకు రావడానికి మహిళా సమాఖ్య భవనాలు ఉపయోగపడతాయని అన్నారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story