Nakrekal: ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం!
Nakrekal: నకిరేకల్‌లో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు 3 నెలల ఉచిత పోటీ పరీక్షల శిక్షణను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం.
Nakrekal: ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం!
Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణా శిబిరాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే, ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం ప్రారంభించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు రాబోయే 3 నెలల పాటు నిపుణుల చేత ఉచితంగా కోచింగ్ అందించనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ... 2015లో ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌ను స్థాపించిన నాటి నుంచి పేద, మధ్యతరగతి విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నకిరేకల్ పట్టణంలో ఉద్దీపన పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యను అందిస్తున్నామని గుర్తుచేశారు.కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలిచాం. కరోనా మహమ్మారి సమయంలో కషాయ కేంద్రాలు, నిత్యావసర కిట్ల పంపిణీతో పాటు మృతుల అంత్యక్రియల్లోనూ పాల్గొని మానవతా విలువలను చాటుకున్నామని వేముల వీరేశం గుర్తు చేశారు.
విద్యారంగానికి పెద్దపీట..
రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున భారీ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
రూ. 200 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం.
నకిరేకల్ పట్టణంలో ప్రత్యేకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని,ఉచిత శిక్షణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి విద్యార్థి పట్టుదలతో శ్రమించి, పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.నిరుద్యోగ యువత ఉజ్వల భవిష్యత్తు కోసం తమ ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో
డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత,సీనియర్ నాయకులు పూజర్ల శంభయ్య, చామల శ్రీనివాస్, నాగులవంచ వెంకటేశ్వర్లు,ప్రిన్సిపల్ బెల్లి యాదయ్య,ఆర్‌సీ రెడ్డి కోచింగ్ అధ్యాపకులు వేముల సైదులు,మండల పార్టీ అధ్యక్షులు గాదగోని కొండయ్య,టౌన్ అధ్యక్షులు లింగాల వెంకన్న,ఉద్దీపన కోఆర్డినేటర్ చెరుకు సతీశ్
తో పాటు మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ విద్యార్థులు పాల్గొన్నారు.




