Chityal: చిన్న కాపర్తి కనకదుర్గమ్మ ఆలయంలో విపుల్ కుమార్ పూజలు!
Chityal: చిట్యాల మండలం చిన్న కాపర్తి కనకదుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో వేముల విపుల్ కుమార్. అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారి దర్శనం, అన్నదానంలో భాగస్వామ్యం.
Chityal: చిన్న కాపర్తి కనకదుర్గమ్మ ఆలయంలో విపుల్ కుమార్ పూజలు!
Chityal: చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ వేముల వీరేశం తనయుడు వేముల విపుల్ కుమార్ గారు పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, చిన్నకాపర్తి గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




