Nalgonda: వెలిమినేడు గ్రామాల్లో దుర్గామాత మండపాలను సందర్శించిన వేముల విపుల్!

Nalgonda: ఇంద్రపాలనగరం, వెలిమినేడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను కాంగ్రెస్ యువ నాయకుడు వేముల విపుల్ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 19 Oct 2026 4:14 PM IST
Nalgonda
X

Nalgonda: వెలిమినేడు గ్రామాల్లో దుర్గామాత మండపాలను సందర్శించిన వేముల విపుల్!

నల్గొండ: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రామన్నపేట మండల కేంద్రంతో పాటు ఇంద్రపాలనగరం, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను యువ నాయకులు వేముల విపుల్ సందర్శించి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం ఆయా గ్రామాల దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు వేముల విపుల్ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL