Nalgonda: అమెరికాలో క్యాన్సర్‌తో వేములపల్లి యువతి మృతి!

Nalgonda: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలానికి చెందిన కందిమళ్ల మాన్వితారెడ్డి అమెరికాలో క్యాన్సర్‌తో మృతి చెందడంతో విషాదం.

Saleem, Nalgonda
Published on: 3 Oct 2026 7:10 AM IST
Nalgonda
X

Nalgonda: అమెరికాలో క్యాన్సర్‌తో వేములపల్లి యువతి మృతి!

Nalgonda: ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన వేములపల్లి మండలం మౌల్యపట్నం గ్రామానికి చెందిన కందిమళ్ల మాన్వితారెడ్డి (25) క్యాన్సర్‌తో మృతి చెందింది. 2023లో బి.ఫార్మసీ పూర్తి చేసిన మాన్విత.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసుకుంది. ఇటీవలే హెచ్1-బి వీసా పొంది ఉద్యోగ వేటలో ఉంది.

​సెప్టెంబర్ 4న గొంతు నొప్పితో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు స్టేజ్-4 క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. చేతికొచ్చిన కూతురు మృతితో తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, పద్మ దంపతులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం నాటికి ఆమె మృతదేహం హైదరాబాద్ చేరుకోనుందని బంధువులు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda