Suryapet: బైండోవర్ నిబంధనలు బ్రేక్.. 45 రోజులు జైలుకు పంపిన పోలీసులు!
Suryapet: సూర్యాపేట జిల్లాలో బైండోవర్ ఉల్లంఘన. ₹3 లక్షల పూచీకత్తు చెల్లించని రాపాణి శ్రీనుకు 45 రోజుల జైలు శిక్ష. ఎస్పీ నరసింహ హెచ్చరిక.
Suryapet: బైండోవర్ నిబంధనలు బ్రేక్.. 45 రోజులు జైలుకు పంపిన పోలీసులు!
సూర్యాపేట: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నేరానికి పాల్పడిన ఓ వ్యక్తికి 45 రోజుల జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ తెలిపారు.
చివ్వెంల మండలం దూరాజిపల్లి తెళ్లబండ కాలనీకి చెందిన రాపాణి శ్రీను పై గతంలో జరిగిన కొట్లాట కేసులో చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సత్ప్రవర్తనతో మెలగుతానని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్/తహశీల్దార్ వద్ద ₹3 లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేసుకున్నాడు.
అయితే శ్రీను బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరానికి పాల్పడ్డాడు. ఈ మేరకు చివ్వెంల పోలీసులు మరో కేసు నమోదు చేసి అతడిని మండల న్యాయవాది అధికారి ముందు హాజరుపరిచారు. పూచీకత్తు మొత్తం ₹3,00,000 జరిమానా విధించగా, చెల్లించలేకపోవడంతో తహశీల్దార్ ఉత్తర్వుల మేరకు 45 రోజులు జైలుకు తరలించారు.
బైండోవర్ అంటే అలవాటుగా నేరాలకు పాల్పడకుండా, ప్రజా జీవనానికి భంగం కలిగించకుండా సత్ప్రవర్తనతో ఉండేందుకు ఇచ్చే అవకాశమని ఎస్పీ వివరించారు. ఒకసారి కేసులు నమోదైన వారు సత్ప్రవర్తనతో ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు.




